క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్ ఆగింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫైటర్ రోల్ చేస్తున్నారు కాబట్టి విదేశీ ఫైటర్స్‌తో ఓ ఫైట్‌ను పూరీ జగన్నాథ్ ప్లాన్ చేశారని, అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల ఆ ఫైట్‌తో పాటు విదేశాల్లో చిత్రీకరించాల్సిన షెడ్యూల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నారన్ని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ట్విట్టర్ ద్వారా స్పందించారు. “ఫైటర్ స్క్రిప్ట్ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్. ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే షూటింగ్ ప్రారంభిస్తాం. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేస్తాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం” అని ఛార్మి క్లారిటీ ఇచ్చారు.
previous post