telugu navyamedia
సినిమా వార్తలు

కొబ్బ‌రి మ‌ట్ట‌ : “అ..ఆ… ఇ..ఈ….” వీడియో సాంగ్ ప్రోమో

Kobbari matta

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ తాజాగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “కొబ్బ‌రి మ‌ట్ట‌”. హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. 2015లో మొద‌లైన ఈ చిత్రం జూలై 19న విడుద‌ల కానుంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాని మ‌ళ్ళీ ఆ డేట్ మారుస్తూ ఆగ‌స్ట్ 2న చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్రకటించారు. “కొబ్బ‌రి మ‌ట్ట” చిత్రానికి సంబంధించి గ‌తంలో ప‌లు సాంగ్స్‌, టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. వాటికి మంచి స్పందన వ‌చ్చింది. ఇక తాజాగా చిత్రం నుండి “అ..ఆ , ఇ..ఈ….” అంటూ సాగే పాట‌కి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ఈ పాట మొత్తం తెలుగు అక్ష‌ర‌మాల‌తోనే ఉండ‌గా ఇందులో సంపూర్ణేష్ స్టెప్స్ అభిమానుల‌కి మంచి వినోదాన్ని క‌లిగిస్తున్నాయి.

“హృదయ కాలేయం”, “సింగం 123” తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు “కొబ్బరి మ‌ట్ట”తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Related posts