హైదరాబాద్ లోని తమ నివాసం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన జూమ్ యాప్ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది.
చంద్రబాబు మాట్లాడుతున్న వేళ, వెనుకే ఉన్న బుక్ ర్యాక్ వద్దకు తనకు కావాల్సిన పుస్తకం కోసం దేవాన్ష్ రావడం, ఆ ఫ్రేమ్ లో కనిపించడమే ఇందుకు కారణం. ఇక తన తాతయ్య, ఓ సమావేశంలో ఉన్నారన్న సంగతిని వెంటనే అర్థం చేసుకున్న దేవాన్ష్, మెల్లగా నక్కుతూ వెళ్లాడు. ఆపై పాకుతూ పక్కకు జరిగి, అక్కడే ఉన్న ‘అక్బర్ బీర్బల్’ కథల పుస్తకాన్ని తీసుకుని వెళ్లాడు. దేవాన్ష్ కనిపిస్తున్న వీడియో క్లిప్ ను కట్ చేసి టీడీపీ శ్రేణులు నెట్టింట పెద్దడంతో వైరల్ అయింది.