ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ను ఆ జట్టు యాజమాన్యం తప్పించిన్నప్పుడు.. మరి కోచ్‌లపై ఎందుకు వేటు వేయలేదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. ఫుట్‌బాల్ ఆటలో జట్టు తడబడితే.. మొదటగా తప్పించేది మేనేజర్‌నే అని, క్రికెట్‌లో ఎందుకు అలా తప్పించరన్నారు. తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తప్పించడం పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక్కడ ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా. జట్టు ఓటములతో సీజన్ మధ్యలో కెప్టెన్‌ని మార్చినప్పుడు.. కోచ్‌లను ఎందుకు మార్చరు?. ఇది సమంజసం కాదు. ఫుట్‌బాల్ ఆటలో చూడండి.. జట్టు తడబడితే మొదటగా తప్పించేది మేనేజర్‌నే. క్రికెట్‌లో మాత్రం ఎందుకు అలా తప్పించరు’ అని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశ్నిచారు. హైదరాబాద్‌కు ఎప్పటికీ మర్చిపోయి ఆరంభం దక్కిందని, ఐపీఎల్ వాయిదా వారికి పెద్ద ఉపశమనం అని పేర్కొన్నారు.
previous post
next post
మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ ప్రశంసలు