telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఫ్రెండ్ బాత్రూమ్లో నుంచి లేటుగా బయటకు వచ్చాడని… అతడేం చేశాడంటే…!?

Pasco man

ఫ్లోరిడాలోని హడ్సన్‌కు చెందిన సెడ్రిక్ వోఫార్డ్ (36) అనే వ్యక్తి మరో ఫ్రెండ్‌తో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే సెడ్రిక్ ఉన్నట్టుండి తన ఫ్రెండ్‌పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఇంతకు ఆ స్నేహితుడు చేసిన తప్పేంటో తెలుసా? బాత్రూంకెళ్లి ఆలస్యంగా బయటకు రావడమే. దీంతో ఎంతకూ బయటకు రాని ఫ్రెండ్‌పై సెడ్రిక్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ఇంకేముంది రూమ్‌మేట్‌ ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అతడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు పాస్కో కౌంటీ పోలీసులను ఆశ్రయించాడు. కేవలం తాను బాత్రూంలోంచి ఆలస్యంగా బయటకు వచ్చానని తన మిత్రుడే తనను చావగొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పాస్కో కౌంటీ పోలీసులు సోమవారం మధ్యాహ్నం సెడ్రిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడ్ని ల్యాండ్ ఓ లేక్స్ నిర్బంధ కేంద్రానికి తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాస్కో కౌంటీ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

Related posts