తెలుగు సినీ పరిశ్రమలోని అన్యోన్యమైన దంపతుల్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమత్ర జంట ముందు వరసలో ఉంటారు. “వంశీ” సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్‌కు సంబంధించిన సినిమా, బ్రాండింగ్ వ్యవహారాలను నమ్రత పర్యవేక్షిస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నమ్రత తన భర్త, పిల్లలకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసి తన ప్రేమను మరోసారి అందంగా వ్యక్తం చేశారు. “డియర్ డ్రగ్స్.. నీతో నాకు పనిలేదు.. నేను ఇప్బటికే మహేష్‌బాబుకు అడిక్ట్ అయిపోయాను” అని కామెంట్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.