telugu navyamedia
సినిమా వార్తలు

మరోసారి ప్రేక్షకుల ముందుకు “ఇస్మార్ట్ ” బొమ్మ

Ismart-Shankar

పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో రామ్, న‌భా న‌టేష్‌, నిధి అగ‌ర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “ఇస్మార్ట్ శంక‌ర్”. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ చిత్రం మ‌ళ్ళీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. సెప్టెంబ‌ర్ 28న పూరీ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆ రోజుతో పాటు సెప్టెంబ‌ర్ 27, 29 తేదీల‌లో చిత్రం థియేట‌ర్స్‌లో ప్ర‌ద‌ర్శితం కానున్న‌ట్టు సినిమా కో ప్రొడ్యూస‌ర్ ఛార్మి పేర్కొంది. ఏపీ, తెలంగాణ‌ల‌లో మొత్తం 10 థియేట‌ర్స్లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాని మ‌ళ్ళీ మ‌ళ్ళీ చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయండ‌ని ఛార్మి పేర్కొంది. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌తో పాటు, దిమాక్ ఖరాబ్ అనే వీడియో సాంగ్స్ విడుద‌ల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌ళ్ళీ “ఇస్మార్ట్ బొమ్మ” థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్న నేప‌థ్యంలో అభిమానులు మ‌రోసారి చిత్రాన్ని ఆద‌రిస్తారా అనేది చూడాలి.

Related posts