మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గని’. బాక్సింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 3 న విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల ఈ చిత్రం నుండి ‘గని’ సాంగ్ విడుదల విడుదలై చక్కటి స్పందన తెచ్చుకుంది.
ఈ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అయాన్ చేసిన వర్కవుట్ వీడియోను జతచేసి ‘లిటిల్ సర్ ప్రైజ్’ అని గీతా ఆర్ట్స్ ట్విట్టర్లో టీమ్ షేర్ చేసి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. త్వరలో అయాన్ కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడు అంటూ అభిమానులు బన్నీ అభిమానుల సంబరం పడిపోతున్నారు.
అల్లు అయాన్ పెదనాన్న బాబీ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రధారులు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. జగపతి బాబు, ఉపేంద్ర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.
Here's the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani💫🥊#AlluAyaanForGhani 🤩
▶️ https://t.co/tSzQqmIjjY @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/5iCSghYI4H
— Geetha Arts (@GeethaArts) November 8, 2021