telugu navyamedia
తెలంగాణ వార్తలు

బండి సంజ‌య్ నీవు ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ వా?..

ఈ దేశంలో నిజాలు మాట్లాడేవారిపై, ప్రజల పక్షాన మాట్లాడేవారిపై దేశద్రోహిగా ముద్ర వేయడం పరిపాటిగా మారిందని ఇవాళ ప్రగతి భవన్ మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

బీజేపీ నేతలు తమను ఏం చేయలేదని, వారి బెదిరింపులకు భయపడమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తాము ఎవరితోనైనా, ఎంత దాకా అయినా పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని ఉద్యమం సాగించిన చరిత్ర మరచిపోవద్దని అన్నారు.

రైతుల ప్ర‌యోజ‌నాల కోసం కొట్లాడుతాం. మా ప్రాణం పోయే వ‌ర‌కు తెలంగాణ కోసం, రైతుల ప్రయోజ‌నాల కోసం కొట్లాడుతాం అన్నారు.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనే వ‌ర‌కు పోరాడుతాం. మీ తాత జేజ‌మ్మ ఎవ‌రున్నా వ‌దిలిపెట్టం.

దేశ ఖజానాలో మా వాటా కూడా ఉందని, దేశ ఖజానా నీ అయ్య సొత్తు ఏమీ కాదని, మిమ్మల్ని వ‌ద‌లం, వేటాడుతాం.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే వ‌ర‌కు పోరాడుతాం   బండి సంజయ్‌ను ఉద్ధేశించి ఆయన మండిపడ్డారు.

ఈ రాష్ట్రం కోసం క‌ట్టిన ప్రాజెక్టుల్లో మా అత్త‌గారి పొలం, మా పొలంతో పాటు ఊర్ల‌న్నీ మునిగిపోయాయి. మేం దొంగ సొమ్ముతో బ‌త‌కం. అందుకే మేం దేనికి భ‌య‌ప‌డం. నా హ‌ద్దుల‌ను నిర్ణ‌యించ‌డానికి నీవు ఎవ‌రు? అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు

దిక్కు మాలిన పాద‌యాత్ర చేసుకుంటూ.. కేసీఆర్ నీ ఫామ్ హౌజ్‌కు వ‌చ్చి దున్నుతా అంట‌డు. ఏం బండి సంజయ్ నువ్ పార్టీని నడపడం వదిలి ట్రాక్టర్ నడుపుతున్నావా.. నీవు ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ వా? అంటూ బండి సంజ‌య్‌కు సీఎం కేసీఆర్ చుర‌క‌లంటించారు.

వంద ఎక‌రాల్లో నేను, నా కొడుకు వ్య‌వ‌సాయం చేసుకుంటున్నాం. మాకేం మ‌నీలాండ‌రింగ్‌లు, బొండ‌రింగ్‌లు లేవు. మాకేం కంపెనీలు లేవు.. దందాలు లేవు. మాకేం బిజినెస్‌లు లేవు. దొంగ వ్యాపారాల్లేవు. మీరు మ‌మ్మ‌ల్ని ఏం చేయ‌లేరు. మేం నిజాయితిగా ఉన్నాం.. నిఖార్సుగా ఉన్నాం. ఎవ‌రితోనైనా పోరాడుతాం. ఎవ‌రికీ భ‌య‌ప‌డం అంటూ బండిపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు.

నా ఫామ్ హౌజ్ వ‌ద్ద అడుగుపెడితే ఆరు ముక్క‌లు అయిత‌వ్ బిడ్డా అంటూనే.. అది గెస్ట్ హౌజ్ కాదు.. అది ఫార్మ‌ర్ హౌజ్.. అన్ని లంగ మాట‌లు మాట్లాడుతావ్ అంటూ మండిపడ్డారు.

తెలంగాణకు బీజేపీ, బండి సంజయ్‌ ఏం చేశారో చెప్పాలి. దేశంలో ఏ వర్గం ప్రజలకు, ఏ జాతికి మీరు మేలు చేశారు. మేము లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 70 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నం’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Related posts