డ్రగ్స్ కేసులో విచారణకు సంబంధించి ఎన్సీబీ అధికారులు గురువారం మధ్యాహ్నం బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, నటి అనన్య పాండే నివాసాల్లో సోదాలు నిర్వహించారు. నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్‌కు ఈమె స్నేహితురాలు.
అలాగే.. ఆర్యన్‌ఖాన్ ఫోన్ చాట్‌లో ఉన్న నటి అనన్య పాండే అని సమాచారం. ఈ క్రమంలోనే ఆర్యన్ డ్రగ్స్ కేసులో భాగంగా ఎన్సీబీకి చెందిన ఒక బృందం షారుఖ్ నివాసం మన్నత్‌కు చేరుకోగా, మరో బృందం అనన్య పాండే ఇంటికి చేరుకుంది. దర్యాప్తు అనంతరం రెండు బృందాలూ వెనక్కి వెళ్లిపోయాయి.
క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్టైన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై అక్టోబరు 26న బాంబే హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఆర్యన్‌తోపాటు అర్బాజ్ మర్చెంట్, మున్మున్ ధర్మేచాలు కూడా అరెస్టయ్యారు. వీరి బెయిల్ పిటిషన్లను నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) కోర్టు ఇదివరకు తిరస్కరించింది. దీంతో బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆర్యన్ తరఫు న్యాయవాదులు తెలిపారు.