telugu navyamedia
సినిమా వార్తలు

73 సంవత్సరాల “పాతాళ బైరవి”

నందమూరి తారకరామారావు గారు తొలిసారి జానపద హీరోగా నటించిన విజయా వారి “పాతాళ బైరవి చిత్రం 15-03-1951 విడుదలై చరిత్ర సృష్టించింది.

నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి లు, విజయా బ్యానర్ పై ప్రఖ్యాత దర్శకులు కె.వి. రెడ్డి గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈచిత్రానికి కధ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు, సంగీతం: ఘంటసాల, ఫోటోగ్రఫీ: మార్కస్ బార్ట్లే, కళ: గోఖలే, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, ఎడిటింగ్: సి.పి. జంబులింగం,ఎం.ఎస్. మణి, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, మాలతి, సి.ఎస్.ఆర్, ఎస్.వి.రంగారావు, రేలంగి, బాలకృష్ణ(అంజి), పద్మనాభం, గిరిజ, సావిత్రి, టి.జి.కమలాదేవి, లక్ష్మీకాంతం, శాంతమ్మ, హేమలత అమ్మారావు తదితరులు నటించారు.

ప్రఖ్యాత గాయకులు, సంగీత దర్శకులు
ఘంటసాల గారి సంగీత సారధ్యం లో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
“కలవరమాయే మదిలో నామాదిలో”
“ప్రేమకోసమై వలలో పడేనే పాపం పసివాడు”
“ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షనమో”
“వినవే బాలా నాప్రేమ గోలా”
“తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయీ”
వంటి మధురమైన పాటలు నాటికి, నేటికి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచి పోయాయి.

“పాతాళభైరవి” సినిమా వెండితెరపై కథానాయక పాత్రకు ఓ కొత్త ఫార్ములాను సృష్టించింది. కధానాయకుడు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని, ప్రతినాయకుడిపై విజయం సాధించి, కధానాయికను సొంతం చేసుకోవడమనే ఓ పెద్ద బాక్సాఫీస్ ఫార్ములాకు ఈ చిత్రం శ్రీకారం చుట్టింది.

1951 మార్చి 15న ఆంధ్రదేశంలోని 13 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రానికి నేటితో 73 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న చిత్రం “పాతాళభైరవి”. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఒకే హీరో తో నిర్మాణం జరుపుకున్న తొలి ద్విభాష చిత్రం కూడా ఇదే కావడం విశేషం.

1951 మార్చి 15 వ తేదీన తెలుగు చిత్రం ‘పాతాళ భైరవి’ తెలుగు విడుదల కాగా 1951 మే 17 వ తేదీన తమిళ చిత్రం “పాతాళ బైరవి” విడుదలైనది. ఈ చిత్రం రెండు భాషల్లోను మంచి విజయం సాధించింది. ఆ పిదప 1952 లో ఉత్తరాదిన హిందీ లో కూడా విడుదలై విజయం సాధించింది.1952 జనవరిలో భారతదేశం లో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం లో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం “పాతాళ బైరవి”.

మొదటి రన్ లో 13 కేంద్రాలలో విడుదల అయ్యి అన్ని కేంద్రాలలో 91 రోజులు ఆడింది.
విశాఖపట్నం — సరస్వతి పిక్చర్ ప్యాలెస్,
భీమవరం — మారుతి టాకీస్,
కర్నూల్ — చాంద్ బాబా టాకీస్ లలో 91 రోజులు ఆడింది.

మిగిలిన10 కేంద్రాలులో100 రోజులు ప్రదర్శింపబడింది. ఈ చిత్రం ఫస్ట్ రిలీజ్ లో 10 కేంద్రాలు, మరియు లేట్ రిలీజ్ తో కలిపి మొత్తం 32 కేంద్రాలలో శతదినోత్సవం (100 రోజులు) జరుపుకున్నది. అలాగే 5 కేంద్రాలలో 175 రోజులు ఆడింది.(సిల్వర్ జూబ్లీ) జరుపుకున్నది. విజయవాడ లో 200 రోజులు పైగా ప్రదర్శింపబడింది.

100 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాలు:-
1.విజయవాడ – దుర్గా కళామందిరం ,
2.విజయనగరం – శ్రీ కృష్ణా,
3.రాజమండ్రి – అశోక ,
4.కాకినాడ – క్రౌన్ ,
5.ఏలూరు – పాండురంగ,
6.భీమవరం – మారుతి,
7.గుడివాడ – శ్రీనివాస ,
8.మచిలీపట్నం – మినర్వా,
9.తెనాలి – రత్న,
10.నెల్లూరు – శేష్ మహల్ ,
11.రామచంద్రాపురం – లక్ష్మీ ,
12.మదనపల్లె – జ్యోతి,
13.చీరాల – మోహన్,
14.తిరుపతి – మహావీర్ ,
15.అనంతపురం – రఘువీర్,
16.వరంగల్ – చౌదరి,
17.నిజామాబాద్ – ప్రభాత్,
18.కడప – సాయిబాబా,
19.ప్రొద్దుటూరు – రౌనఖ్ ,
20.పొన్నూరు —
21.అమలాపురం – కృష్ణా ,
22.గుంటూరు – సరస్వతి ,
23.హైదరాబాద్ – సాగర్ ,
24.సికింద్రాబాద్ – మినర్వా ,
25.మద్రాస్ – శ్రీ కృష్ణ,
26.మైసూరు – రాజ్ కమల్,
27.మంగుళూరు – బాలాజి ,
28.షోలాపూర్ – సరోజ ,
29.కోయంబత్తూర్ – వెరయిటీ ,
30.మధురై – న్యూ సినిమా ,
31. బెంగుళూరు – మినర్వా ,
32. బళ్ళారి – ప్రభాత్
థియేటర్ లలో శతదినోత్సవం జరుపుకున్నది.
175 రోజులు (సిల్వర్ జూబ్లీ) ప్రదర్శింపబడిన కేంద్రాలు:-
1.విజయవాడ — దుర్గా కళామందిరం (245 రోజులు)
2.గుడివాడ — శ్రీనివాస,
3.నెల్లూరు — శేష మహల్,
4.బళ్లారి — ప్రభాత్,
5.బెంగళూర్ — మినర్వా ,
ధియేటర్లలో రజతోత్సవం (25వారాలు) జరుపుకున్నది.

విజయవాడ — దుర్గా కళామందిరం థియేటర్ లో ఏకధాటిగా 245 రోజులు ప్రదర్శింపబడి తెలుగు చలనచిత్ర చరిత్రలోనే రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా ధియేటర్ మారకుండా డైరెక్టుగా 200 రోజులు (ద్విశత దినోత్సవం) జరుపుకున్న తొలి తెలుగు సినిమా  “పాతాళ బైరవి”.  ఇది తెలుగు సినీ చరిత్ర లో ఒక రికార్డు.

Related posts