telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను లవ్ ఫెయిల్యూరే… మహేష్ బాబు హీరోయిన్

Kiara-Advani

కియారా అద్వాణీ అరంగేట్రం చేసిన అనతికాలంలో బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగింది. ‘ధోనీ’ ‘కబీర్‌సింగ్‌’ చిత్రాలతో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తెలుగులో ‘వినయ విధేయ రామ’ ‘భరత్‌ అనే అనే’ చిత్రాల్లో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఓ టీవీ షోలో జరిగిన కార్యక్రమంలో తన హైస్కూల్‌ రోజుల్లోని ప్రేమాయణం గూర్చి తెలిపింది కియారా అద్వాణీ. తొలిప్రేమ తాలూకు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయంలో పదిలంగా ఉంటాయి. ఎన్నిసార్లు తరచి చూసినా తొలియవ్వనపు రోజుల్లోని వలపుకథలు మధురంగానే అనిపిస్తాయి. తొలి ప్రేమ విఫలమైనా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే అనిపిస్తాయని చెప్పుకొచ్చిందీ భామ. ‘ప్లస్‌ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. సెలవురోజుల్లో ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి అతడిని కలుసుకునేదాన్ని. మరోవైపు చదువును అశ్రద్ధ చేస్తున్నానంటూ నా తల్లిదండ్రులు కోప్పడేవారు. ఈ సంఘర్షణ నడుమ నా ప్రేమను త్యాగం చేశాను. ఆ సమయంలో నేను మానసిక ఎంతో ఆవేదనకు గురయ్యాను. వయసుపరంగా వచ్చిన పరిపక్వతతో క్రమంగా కోలుకున్నా’ అని చెప్పింది కియారా అద్వాణీ.

Related posts