telugu navyamedia
సినిమా వార్తలు

తెలంగాణ గర్వించదగ్గ హాస్యనటుడు వేణు మాధవ్ : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Venu-Madhav

ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేప‌టి క్రితం క‌న్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:21 నిమిషాలకు వేణుమాధవ్ తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పై కూడా ఆయ‌న రాణించారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌కి ఆయ‌న యాంక‌ర్‌గా కూడా ప‌ని చేశారు. రాజ‌కీయాల‌లోను చురుకుగా ప‌ని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాల‌లో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాల‌లో హీరోగా చేశారు. ఆయ‌న‌కి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అనారోగ్య కార‌ణాల వ‌ల‌న ఐదేళ్లుగా సినిమాల‌కి దూరంగా ఉన్నారు వేణు మాధ‌వ్. చివ‌రిగా రుద్ర‌మ‌దేవి చిత్రంలో కనిపించారు. వేణుమాధవ్ మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ హాస్యనటుడని..మంచి గుర్తింపు పొందిన నటుడిగా ఆయన అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతిచేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వేణుమాధవ్ మృతిపట్ల పలువురు కాంగ్రెస్ నేతలు విచారం వ్యక్తం చేశారు.

Related posts