telugu navyamedia
సినిమా వార్తలు

రేపిస్ట్ అయితే ఏంటి ? నీతి నియమాలు ఉండవు… అజయ్ దేవగణ్  పై రచయిత్రి ఫైర్ 

Vinta Nanda,Ajay Devgan
గత కొంతకాలం క్రితం ఫిలిం ఇండస్ట్రీలో “మీటూ” ఉద్యమం సంచలనం సృష్టించింది. మీటూలో భాగంగా పలువురు సినిమా ప్రముఖులపై పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వెలువెత్తాయి. అలా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న చాలామందికి అవకాశాలు తగ్గిపోయాయి. కానీ అందులో భాగంగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్ కు మాత్రం మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజయ్ దేవగణ్ తన సినిమాలో అలోక్ నాథ్ కు తీసుకుంటున్నందుకు ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన తనుశ్రీ దత్తా అజయ్ ను విమర్శించింది. ఇక అలోక్ త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని, ఆయ‌న వ‌ల్లే కెరీర్ కూడా నాశ‌న‌మైంద‌ని ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి వింటా నందా గ‌తంలో ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.  
తాజాగా వింటా నందా కూడా అజ‌య్‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. “అజయ్ ఇలా చేస్తార‌ని అస‌లు ఊహించ‌లేదు. ఆయ‌న నుంచి ఇంకేమీ ఆశించ‌లేను. అలోక్ రేపిస్ట్ అయితే ఏంటి? దుర్మార్గుడు అయితే ఏంటి? సినిమా కోసం ఎంత ఖ‌ర్చుపెట్టామ‌నేదే వాళ్ల‌కు ముఖ్యం. బాక్సాఫీస్ వార్‌లో నీతినియ‌మాలు ఉండవు. అంద‌రికీ కావాల్సింది డబ్బే” అంటూ వింటా ఫైర్ అయ్యారు.

Related posts