telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పేట” తెలుగు ట్రైలర్… అదరగొట్టేస్తున్న రజినీకాంత్

Rajanikanth Petta release images

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం “పెట్టా”. ఈ చిత్రంలో తలైవా సరసన సిమ్రాన్, త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తమిళ ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేసిన టీమ్, కొత్త సంవత్సరం సందర్భంగా తెలుగులో స్పెషల్ ట్రైలర్ ను వదిలారు. “చూడబోతున్నారుగా… కాళి ఆట. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరినీ మీ పేటలో కలుస్తాను… అప్పటివరకూ “హ్యాపీ న్యూ ఇయర్” అనే డైలాగ్ ఈ ట్రైలర్ లో ఉంది.

తాజాగా “పేట” తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. “20 మందిని పంపించాను. అందరినీ చితక్కొట్టి పంపించాడు” అంటూ మొదలైన ఈ ట్రైలర్ లో “హహాహా… చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట…అనే డైలాగ్, “చూడటానికి చిన్న పిల్లాడిలా చాలా స్టయిల్ గా ఉన్నారు… అని ఓ అమ్మాయి చెప్పగా… స్టయిల్ గా ఉన్నానంట… నాచురల్లీ” అని రజనీ చెప్పే డైలాగ్… అందమైన, అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తావు” అనే డైలాగ్, ఏయ్… నిజం చెబుతున్నాను… కొట్టి అండర్ వేర్ తో పరిగెత్తిస్తాను. పరువు పోతే మళ్లీ తిరిగి రాదు చూస్కో” అని రౌడీలతో రజనీ చెప్పే డైలాగ్ లు ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. “ఎవరికైనా పెళ్లాం పిల్లలు అన్న సెంటిమెంట్, గింటిమెంట్ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. మండిపోతోంది ఇక్కడ… దొరికారా భస్మమే… అనే డైలాగ్… ఇక చివరలో స్వీట్ తినబోతున్నాం అంటూ రజినీ కూల్ గా చెప్పడం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి మీరు కూడా ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

Related posts