telugu navyamedia
సినిమా వార్తలు

“ది అగ్రెసివ్ గాంధీ” : ఆడు తెలంగాణ తెస్త‌నంటే అంద‌రూ న‌వ్విండ్రు

Tiger-Kcr

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఎన్టీయార్‌, ల‌క్ష్మీపార్వ‌తి జీవిత‌క‌థ ఆధారంగా వ‌ర్మ తెర‌కెక్కించిన‌ “ల‌క్ష్మీస్ ఎన్టీయార్‌” ఇటీవ‌ల విడుద‌లై మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కెసిఆర్, వైఎస్సార్ బయోపిక్ ఉంటుందని ప్రకటించారు వర్మ. అన్నట్టుగానే ఇప్పుడు కెసిఆర్ బ‌యోపిక్‌కు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఓ బ‌యోపిక్‌ను వ‌ర్మ తెర‌కెక్కించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ బ‌యోపిక్‌పై వ‌ర్మ‌ దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన వర్మ ఈ సినిమాకు “టైగ‌ర్ కేసీఆర్‌” అని టైటిల్ పెట్టారు. కింద “ది అగ్రెసివ్ గాంధీ” “ఆడు తెలంగాణ తెస్త‌నంటే అంద‌రూ న‌వ్విండ్రు” అని క్యాప్ష‌న్లు పెట్టారు. ఇది కేటీఆర్ తండ్రి బ‌యోపిక్ అని, ఆంధ్రుల‌ పాల‌న‌లో అణిచివేత‌కు గురైన తెలంగాణ ప్ర‌జ‌లకోసం ఆయ‌న ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఎలా సాధించారో ఈ సినిమాలో చూపించ‌బోతున్నామని వ‌ర్మ ట్వీట్ ద్వారా తెలియజేశారు.

Related posts