రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్ సినిమా చిత్రబృందం కొత్త షెడ్యూల్ కోసం ముంబయి చేరుకుంది. విజయ్ దేవరకొండ, దర్శక నిర్మాత పూరి జగన్నాథ్, ఛార్మి స్పెషల్ ఛార్టెడ్ ఫ్లైట్ లో ముంబై వెళ్ళారు. శుక్రవారం వరంగల్ లో జరిగిన పూరి తనయుడు ఆకాశ్ ‘రొమాంటిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడానికి వచ్చిన వీరంతా శనివారం తిరిగి ముంబై లాండ్ అయిన సందర్భంగా చాపర్ ఫ్లైట్ ఎక్కుతున్న దృశ్యాలను ఛార్మి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ చిత్రానికి పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.
కాగా పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో రూపొందిస్తున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డెక్కలేదు : మంచు మనోజ్