telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

54 సంవత్సరాల “ఒకే కుటుంబం”.

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన చిత్రం “ఒకే కుటుంబం” విడుదలై ఇప్పటికి 54 సంవత్సరాలు .
నటుడు నాగభూషణం సమర్పణలో నిర్మాతలు సి.హెచ్.రాఘవయ్య, కె.బసవయ్యలు రవి ఆర్ట్ థియేటర్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు ఏ.భీమ్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: ఏ. భీమ్ సింగ్, మాటలు:పాలగుమ్మి పద్మరాజు, సంగీతం: ఎస్.పి.కోదండపాణి, ఫోటోగ్రఫీ: జి.విఠల్ రావు, పాటలు: దాశరథి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీ శ్రీ, కొసరాజు, దాసరి నారాయణరావు, కళ: తోట వెంకటేశ్వరరావు, నృత్యం: చిన్ని,సంపత్, ఎడిటింగ్: ఏ.పాల్ దొరై సింగం, అందించారు.

ఈచిత్రంలో ఎన్.టి.రామారావు, నాగభూషణం, లక్ష్మీ, రుక్మిణి, కాంతారావు, రాజశ్రీ, అల్లు రామలింగయ్య, నాగయ్య, నారాయణరావు, ధూళిపాళ, నిర్మలమ్మ, చదలవాడ తదితరులు నటించారు.

సంగీత దర్శకుడు కోదండపాణి సారధ్యంలో వచ్చిన పాటలు హిట్ అయ్యాయి.
“మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు”
“అందరికీ ఒక్కడే దేవుడు కొందరికీ రహీము”
“ఔనే తానే నన్నేనే నిజమేనే,అంతా పగలేనే”
“కావాలీ తోడు కావాలీ ఒంటరిదైనా రామచిలుకకు”
వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ సినిమాకు మాతృక “పావమణిప్పమ్” (1961) తమిళ చిత్రం. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ లక్ష్మి మొదటిసారి గా ఎన్టీఆర్ తో నటించింది. దర్శకుడు దాసరి నారాయణరావు ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసారు. ఈ చిత్ర దర్శకుడు ఏ. భీమ్ సింగ్ పలు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నసమయంలో ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాలకు అసోసియేట్ డైరెక్టర్ వున్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలోని “శిల్పాలు శిధిలమైన” అనే పాటను దాసరి నారాయణరావు వ్రాయటం జరిగింది.

Related posts