telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ సినిమా కోసం 5 కోట్లతో హాస్పిటల్ సెట్

Prabhas

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాకు “రాధేశ్యామ్” అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ అభిమానులు ‘రాధేశ్యామ్’ అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ యూరప్ లో ఎక్కువగా జరిగింది. ఇంకా అక్కడే చిత్రీకరణ జరపాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లి షూటింగ్స్ జరిపే అవకాశం లేదు. అందుకే హైదరాబాద్ లోనే ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ ను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితులను ఇక్కడ రీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఈ చిత్రం కోసం 5 కోట్లతో భారీ హాస్పిటల్ సెట్ ను నిర్మిస్తున్నారట. నాలుగు అంతస్తుల ఆ హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్.. ఐసీయూ.. జనరల్ వార్డ్ ఇంకా హాస్పిటల్ పరసరాలు వంటివి క్రియేట్ చేస్తున్నారు. అది కూడా 1980 కాలం నాటి వాతావరణంలో హాస్పిటల్ ను తీర్చి దిద్దుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సెట్ లో దాదాపుగా నెల రోజుల పాటు చిత్ర యూనిట్ సభ్యులు చిత్రీకరణ జరిపేందుకు సిద్దం అవుతున్నారని సమాచారం

Related posts