telugu navyamedia
క్రైమ్ వార్తలు

పెరట్లో ఆడుకుంటున్న రెండేళ్ల పసివాడు… 2 నిమిషాల్లోనే మాయం

boy

రెండేళ్ల పసి పిల్లాడు పెరట్లో ఆడుకుంటున్నాడు… అంత వరకూ అతన్ని గమనిస్తున్న తల్లి రెండు నిముషాలు ఆదమరిచేసరికి ఘోరం జరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే… అర్కాన్సాస్‌లోని లిటిల్‌రాక్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఆ పసిపిల్లాడి పేరు టై డిక్సన్… రెండేళ్ల పిల్లవాడిని ఆడించడానికి అతడి తల్లి తీసుకొచ్చింది. ఇంతలో ఇంట్లో ఏదో పని గుర్తొచ్చి, తోటలో ఆడుకుంటున్న పిల్లాడిని చూసింది. కొడుకు ఆటలో నిమగ్నమైపోవడం చూసి వెంటనే వచ్చేద్దామని భావించింది ఆ తల్లి. అప్పటికీ పసివాడు ఏం చేస్తున్నాడో అని తోటలో అమర్చిన కెమెరాలో ఓ కంట గమనిస్తూనే ఉంది. రెండు నిమిషాలు చేస్తున్న మని మీదకు దృష్టి మళ్లించింది ఆ తల్లి. 2 నిమిషాల తరువాత చూస్తే కెమెరాలో కొడుకు కనిపించలేదు. హడావిడిగా తోటలోకి వచ్చి చూసిన తల్లికి ఆ పసివాడు ఎక్కడా కనబడలేదు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన కొడుకును పిలుస్తూ తోటంతా తిరిగింది.

కేకలకు ఇంట్లోని వారంతా బయటకు వచ్చారు. ఎంత వెతికినా దొరకని ఆ పసివాడి హెల్మెట్ తోటలోని ఓ సెప్టిక్ ట్యాంక్‌లో కన్పించింది. వెంటనే సెప్టిక్ ట్యాంక్ మూత బద్దలు కొట్టిన కుటుంబీకులు పిల్లవాణ్ణి బయటకు తీశారు. అంబులెన్సు కోసం ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న అంబులెన్సులోని సిబ్బంది చేసిన ఆ బాలుడిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇంకేముంది ఆ పసివాడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. పోలిసుల విచారణలో సెప్టిక్‌ట్యాంక్ మూత సగం విరిగిపోయిందని, దానిపై ఓ అట్ట అడ్డం పెట్టి ఉందని, పొరపాటున ఆ అట్టపై అడుగుపెట్టిన పసివాడు ట్యాంకులో పడిపోయినట్లు చెప్పారు. ఆదివారం టై పుట్టినరోజు జరుపుకోవాల్సిందని, అంతలోనే అతన్ని ఇలా పూడ్చిపెట్టాల్సి వచ్చిందని ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ తల్లి ఎంత జాగ్రత్తగా ఉన్నా రెప్పపాటులో పొరపాటు జరిగిపోయింది. ఇలాంటి ఘటనలు మనం కోకొల్లలుగా చూస్తుంటాము. అందుకే పిల్లలను రెప్పపాటు కాలం కూడా వదలకుండా కనిపెట్టుకుని ఉండడం మంచిది.

Related posts