telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

నగ్నంగా ఇంటి బయట తిరుగుతున్న టీచర్… !?

Teacher

ఫ్లోరిడాలోని సిప్రెస్ ఎలిమెంటరీ స్కూల్‌లో బ్రైన్ వీలర్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేసేవాడు. కొద్ది రోజుల క్రితం తన ఇంటి బయట మొక్కల మధ్య నగ్నంగా తిరిగే సమయంలో పక్కింటి వ్యక్తి అతడిని వీడియో తీశాడు. వీలర్‌తో ఇదివరకే శత్రుత్వం ఉండటంతో.. పక్కింటి వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశాడు. దీంతో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యి వీలర్‌ను ఉద్యోగంలో నుంచి తీసేసే స్థాయికి వెళ్లింది. పిల్లల తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తుండటంతో స్కూలు యాజమాన్యం వీలర్‌ను టీచర్‌ ఉద్యోగం నుంచి తీసేసింది. అయితే వీలర్ 20 ఏళ్ల నుంచి ఈ రంగంలో ఉండటం.. మంచి నైపుణ్యం కలిగిన వాడు కావడంతో అతడిని తిరిగి ఉద్యోగంలో చేర్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు యునైటెడ్ ఎడ్యుకేటర్స్ అధ్యక్షుడు ఆల్‌బర్ట్ తెలిపారు. వీలర్ చేసింది తప్పు అవ్వచ్చు కానీ.. ఉద్యోగంలో తీసేసే అంత తప్పు మాత్రం చేయలేదని ఆయన చెప్పారు. కాగా, వీలర్‌పై కేసు కూడా నమోదు అవగా.. అక్టోబరులో ఆ కేసును కొట్టేసే అవకాశముంది.

Related posts