జీవనశైలిలో మార్పుల కారణంగా ఎక్కువ మంది మహిళలు రొమ్ముక్యాన్సర్ బారిన పడుతున్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మంగళవారం రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం విజయవాడ సిద్దార్ధ కళాశాల నుంచి నిర్వహించిన 3కె వాక్ ను ఆయన ప్రారంభించారు.
అనంతరం డీజీపీ మాట్లాడుతూ..మహిళలు ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పౌష్టికాహారం తీసుకొని రోగనిరోధక శక్తి పెంచుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్‌పై మరిన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులను కోరారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు పోలీసుల సహకారం ఉంటుందని వెల్లడించారు.