*ఢిల్లీలోని గోకుల్‌పురిలోని మురికివాడలో అగ్నిప్రమాదం .. ఏడుగురు మృతి..
*ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం..
*బాధిత కుటుంబాలను పరామర్శించనున్న సీఎం కేజ్రీవాల్
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని గోకుల్ పురిలోని శుక్రవారం అర్ధరాత్రి మురికివాడల్లో గుడిసెల్లో మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవ దహనం అయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 ఫైర్ ఇంజన్‌లతో మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు 60 గుడిసెలలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలం నుంచి కాలిపోయిన ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. మరికొందరికి కాలిన గాయాలైనట్లు వెల్లడించారు. ఎట్టకేలకు తెల్లవారుజామున 4 గంటలకు మంటలు ఆర్పివేశామని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు..సంఘటనా స్థలానికి వెళ్లి మృతులు కుటుంబాలకు వ్యక్తిగతంగా కలుస్తానని తెలిపారు.