telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే…ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్ళీపెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1554 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో ఏడుగురు మంది కరోనా తో మృతిచెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,19,224 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,94,653 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం 1,256 మంది మృతిచెందారు.
దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.57 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 87.9 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 88.76 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 23,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు.. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజా కేసులు 249నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 128, మేడ్చల్‌లో 118 , ఖమ్మం 88 , భద్రాద్రి కొత్తగూడెం 95 అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి.

Related posts