telugu navyamedia
క్రీడలు వార్తలు

పడిక్కల్ పై ప్రశంసలు కురిపించిన ఈగ విలన్…

నిన్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డాషింగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ ఐపీఎల్‌లో తొలి సెంచరీని సాధించాడు. 52 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన పేరు మీద సరికొత్త రికార్డ్‌ను లిఖించుకున్నాడు. అతి పిన్న వయస్సులో వంద పరుగుల ల్యాండ్ మార్క్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా నిలిచాడతను. ప్రత్యేకించి పడిక్కల్ తన బ్యాటింగ్ విన్యాసంతో క్రికెట్ ప్రేమికులను కట్టిపడేశాడు. విరాట్ కోహ్లీ వంటి టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కూడా అతని పెర్‌ఫార్మెన్స్ ముందు ప్రేక్షకుడిలా మారిపోయాడు. దేవ్‌దత్ పడిక్కల్ బ్యాటింగ్ పట్ల ఆ రంగంతో సంబంధం లేని వారు కూడా అతణ్ని అభినందిస్తున్నారు. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్.. పడిక్కల్‌ను ఆకాశానికెత్తేశాడు. దేవ్‌దత్ పడిక్కల్ కోసమే తాను మ్యాచ్ మొత్తం చూశానని చెప్పుకొచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదేనని పేర్కొన్నాడు. ఇప్పటిదాకా ఆడిన నాలుగుకు నాలుగు మ్యాచ్‌లనూ రాయల్ ఛాలెంజర్స్ గెలవడాన్ని ఓ కన్నడిగుడిగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు. విరాట్ కోహ్లీ సెల్ఫ్‌లెస్ ప్లే ఆడాడని కామెంట్స్ చేశాడు. తాను సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. పడిక్కల్‌ను అతను ఎంకరేజ్ చేశాడని వ్యాఖ్యానించాడు. పడిక్కల్ మరోసారి తాను ఛాంపియన్‌ అని నిరూపించుకున్నాడని అన్నాడు.

Related posts