telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పర్చూరు బరిలో బీఎస్పీ అభ్యర్థి విజయ్‌కుమార్‌

Parchur contest BSP Vijayakumar

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా జనసేన బీఎస్పీకి కేటాయించింది. బీఎస్పీ అభ్యర్థి పెదపూడి విజయ్‌కుమార్‌ సోమవారం నామినేషన్‌ వేయనున్నారు. సీపీఐ, సీపీఎం, జనసేన మద్దతుతోపాటు బీఎస్పీకి నియోజకవర్గ పరిధిలో మొగ్గుచూపే ఓటర్లు ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీలకు విజయ్‌కుమార్‌ గట్టి పోటీ ఇస్తారని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆయన స్వస్థలం నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ల. ప్రస్తుతం అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఏపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. సామాజిక ఉద్యమాలతో సాధించలేనిది రాజకీయాలతో సాధించవచ్చన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని విజయ్‌కుమార్‌ తెలిపారు.

Related posts