*శ్రీకాకుళం కొత్తరోడ్డు జంక్షన్ వద్ధ హై టెన్షన్
*పలాస వెళ్తున్న లోకేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
*రణస్థలం పీఎస్‌కు తరలింపు..
*పోలీసులతో లోకేష్ వాగ్వాదం
శ్రీకాకుళం కొత్తరోడ్డు జంక్షన్ వద్ధ హై టెన్షన్ నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన లో భాగంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో దిగి రోడ్డు మార్గంలో పలాస శ్రీనివాస నగర్లో పర్యటించటానికి వెళ్తున్న ఆయన్ను శ్రీకాకుళుళం సమీపంలో కొత్త రోడ్ జంక్షన్లో అడ్డుకుని అరెస్ట్ చేశారు. . లోకేష్ తో పాటు టీడీపీ నేతలు వెంకట్రావు చిన్నరాజప్పలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రణస్థలం పీఎస్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే..
19వ తేదీన.. అర్ధరాత్రి సమయంలో.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఇళ్ల కూల్చివేత యత్నంతో వివాదం చెలరేగింది. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నవారి ఇళ్లను కూలుస్తామనడంపై భగ్గుమంటున్నారు టీడీపీ నేతలు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని నిలదీస్తున్నారు.
నేతలు పలాసకు వెళ్లకుండా జిల్లావ్యాప్తంగా బలగాలను మోహరించారు. ఆదివారం సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఎస్పీ హెచ్చరించారు.
ప్రధాన రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కూన రవిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. రవి నివాసం దగ్గర భారీగా మోహరించారు పోలీసులు.
పవన్ కల్యాణ్ లాంగ్‌మార్చ్ అట్టర్ఫ్లాఫ్: విజయ సాయిరెడ్డి