telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి- కల్వకుంట్ల ఫ్యామిలీని గద్దె దింపడమే నా లక్ష్యం

*బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
*అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న‌రాజగోపాల్‌రెడ్డి
*బీజేపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన అమిత్ షా

మునుగోడు మాజీ ఎమ్మెల్యే, మాజీ కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రం హోంమంత్రి అమిత్‌షా మునుగోడులోని బీజేపీ బహిరంగసభ వేదికపై రాజగోపాల్‌రెడ్డి మెడలో కాషాయం కండువా కప్పు బీజేపీ లోకి అమిత్ షా ఆహ్వానించారు.

ఈసందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ .. ‘‘తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు నేను. మునుగోడు ప్రజల తలదించుకునే పని ప్రాణం పోయినా చేయను’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం కోసం యుద్ధం జరుగుతోందన్నారు.

కల్వకుంట్ల ఫ్యామిలీని గద్దె దింపడమే తన లక్ష్యమని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు .తాను పార్టీ మారింది మునుగోడు ప్రజల కోసమే. తన రాజీనామాతోనే కేసీఆర్ దిగొచ్చారని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. తాను స్వార్ధం కోసం పార్టీని మారుతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. 

ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని మునుగోడు ప్రజల కోసమే వదులుకున్నానని చెప్పారు.  ఎన్నిసార్లు అడిగిన ముఖ్యమంత్రి అపాయిమెంట్‌ ఇవ్వలేదు.

ఫామ్‌ హౌస్‌లో పడుకునే కేసీఆర్‌కి ప్రజల కష్టాలు గుర్తుకు రాలేదని..తన రాజీనామాతో మునుగోడు ప్రజలు గుర్తుకు వచ్చారని చెప్పారు.

శనివారం నిర్వహించిన సభకు డబ్బులిచ్చి ప్రజల్ని తరలించాలని చూశారని ఆరోపించారు. చివరకు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధి పేరును ప్రకటించే ధైర్యం చేయలేకపోయారు కేసీఆర్ అంటూ రాజగోపాల్‌రెడ్డి. ఘాటు విమర్శలు చేశారు.

నిజంగా తాను స్వార్ధం కోసమే చేసుకుంటే ఉపఎన్నికలకు ఎందుకు సిద్ధపడతానని చెప్పారు. కేవలం టీఆర్ఎస్‌ పార్టీకి బుద్ధి చెప్పడానికి, కేసీఆర్ మెడలు వంచడానికే తాను రాజీనామా చేశానన్నారు. తాను చేస్తున్న ధర్మయుద్ధంలో ప్రజలంతా తనకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు రాజగోపాల్‌రెడ్డి.

కాగా.. కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 4వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. సోనియా గాంధీకి లేఖ పంపారు.ఈ నెల 8వ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను స్పీకర్ అదే రోజున ఆమోదించారు. దీంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Related posts