ప్రజల నాడి అటు 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2019 ఏప్రిల్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నాను అని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రజానాడి పసిగట్టడంలో వరుసగా రెండుసార్లు విఫలమైనందుకు, భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
తన సర్వేల వల్ల ఎవరైనా, ఏ పార్టీ అయినా నొచ్చుకొని ఉంటే మన్నించగలరు అని విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్ జగన్‌కు లగడపాటి రాజగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు.