telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అందమైన అతిపెద్ద ఫిలింసిటీ నిర్మాణం: యోగి ఆదిత్యనాథ్

yogi adityanath

రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అందమైన అతిపెద్ద ఫిలింసిటీని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.

గౌతం బుద్ధనగర్‌ జిల్లాలో అందమైన ఫిలింసిటీని నిర్మించనున్నట్టు చెప్పారు. దీని నిర్మాణం కోసం నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రే వే సమీపంలో స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే, మీరట్‌లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టును మార్చి 2025లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Related posts