telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది..

టీఆర్‌ఎస్‌ పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు..2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అవుతాడని పేర్కొన్నారు. బిజెపి, టిఆర్ఎస్ తప్పుడు ప్రచారం వల్ల మొన్న దుబ్బాకలో ఓటమి పాలయ్యామని.. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని జోస్యం చెప్పారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి రోజులు దగ్గరపడ్డాయని… అధికారులు తొత్తులుగా మారకండని హితువు పలికారు. కెసిఆర్ అంత నిస్సిగ్గుగా ఏ సిఎంను చూడలేదని.. బీజేపీతో, టిఆర్ఎస్ గల్లీమే కుస్తీ.. ఢిల్లీమే దోస్తీ చేస్తోందని నిప్పులు చెరిగారు. అణగారిన వర్గాలకు కాంగ్రెస్ అండ ఉందని..,ఏడేండ్లలో పది లక్షల కోట్లు ఖర్చు చేసి.. రైతుల కొనుగోలు ద్వారా నష్టం వచ్చిందనడం కేసీఆర్ అనడం సిగ్గుచేటని ఫైర్‌ అయ్యారు. ప్రతి గ్రామంలో ప్రతి గింజ కొనాల్సిందే లేదంటే పోరాటమేనని హెచ్చరించారు. ఈ నెల 11న ప్రతి జిల్లాలో కొనుగోలు కేంద్రాల విషయంలో నిరసన నిర్వహిస్తామని.. ఢిల్లీలో చలికి వణుకుతూ రైతులు నిరసన తెలిపినా మోడి స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Related posts