telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ వార్తలు నిజమేనంటున్న సమంత

Samantha

అక్కినేని కోడలు సమంత “ఫ్యామిలీ మేన్” సీజన్-2 ద్వారా డిజిటల్ అరంగేట్రం చేయబోతోంది. ఈ మేరకు “ఫ్యామిలీ మేన్” సీజన్-2 వెబ్‌సిరీస్ గురించి సమంత తొలిసారి స్పందించింది. తాను “ఫ్యామిలీ మేన్-2” వెబ్‌సిరీస్‌ ద్వారా డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, నీరజ్, శరద్ కేల్కర్ కీలక పాత్రలు పోషించిన “ఫ్యామిలీ మేన్” తొలి సీజన్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కబోతోంది. మధ్య తరగతికి చెందిన ఓ వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇంటిలెజెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఆ ఇతివృత్తం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రాజ్ నిడమోరు, కృష్ణ డీకే రూపొందించిన “ఫ్యామిలీ మేన్” మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక ఈ సిరీస్‌ రెండో సీజన్‌లో సమంత కీలక పాత్ర పోషించబోతోందని రాజ్ నిడమోరు, కృష్ణ డీకే వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. “ది ఫ్యామిలీ మేన్-2″.. అత్యంత ఆదరణ పొందిన సిరీస్ ద్వారా డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నాను. డ్రీమ్ రోల్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు” అని సమంత పోస్ట్ చేసింది. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్టు సమాచారం.

Related posts