telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హర్రర్ సినిమా 12’O క్లాక్ ట్రైలర్ వచ్చేసింది…

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కొత్త రకం కథలతో సినిమాలు చేస్తుంటాడు. ఇక హర్రర్ సినిమాలకు వర్మ పెట్టింది పేరు. అయితే ప్రస్తుతం ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు సినిమాలు చేస్తాడు. అయితే మరి ఏమైందో తెలియదు కానీ వర్మ రివర్స్ గేర్ వేసి తన రెగ్యులర్ ట్రాక్‌లోకి వెళ్ళాడు. అదేవిదంగా సరికొత్త హర్రర్‌ను తెరకెక్కించి మళ్లీ అందరిని భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇది ఫార్ట్ ఫిలిం కాదు. ఫుల్ లెంత్ సినిమా అని ముందే వర్మ ప్రకటించాడు. ఇప్పుడు తన కొత్త సినిమా 12’O క్లాక్ అప్‌డేట్స్ ఆసక్తి రేపుతున్నాడు. 12’O క్లాక్ ట్రైలర్2గా వర్మ వదిలిన వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా భయపెట్టేశాడు. కేవలం హర్రర్‌ను ఉపయోగించి వెన్నులో వణుకుపుట్టించాడు. అయితే ఈ సినిమా వేగంగా అభివృద్ది చెందుతున్న సైన్స్‌కు దెయ్యాలకు సంబంధం ఏమైనా ఉందా అనే అంశంపై ఈ సినిమా తెరకెక్కతోంది. ఈ సినిమాను జనవరీ8న విడుదల చేయనున్నట్లు ఈ ట్రైలర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, ఆషిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

Related posts