telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అర్జున్ రెడ్డి’ టీం కాంబినేషన్ వెబ్ సిరీస్

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ, దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా ఇద్దరూ స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కలిసి ఒక వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నిర్మాణ సంస్థ అయిన కింగ్‌ ఆప్ ది హిల్స్ తరపున ఓ రెండు వెబ్ సిరీస్‌లు రానున్నాయట. అందులో భాగంగా ఓ ప్రాజెక్టుని కేవీఆర్ మహేంద్రకి అప్పజెప్పే అవకాశాలున్నాయి. మహేంద్ర గతంలో విజయ్ తమ్ముడు ఆనంద్ ప్రధాన పాత్రలో దొరసాని అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక మరో ప్రాజెక్ట్‌ను సందీప్ వంగతో కలిసి విజయ్ దేవరకొండ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తాడట. మొత్తానికి ‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ రాబోతుంది. ప్రస్తుతం సందీప్ వంగా బాలీవుడ్ లో మరో చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేస్తోన్నాడు. మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేస్తోన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Related posts