telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నేడు గోల్కొండ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

golkonda bonaalu

బోనాల పండుగను పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు వస్తుండడంతో నేడు హైదరాబాద్ గోల్కొండ మార్గంలో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు గోల్కొండలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. రద్దీ కారణంగా రోడ్లలో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. బోనాలకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఆయా రూట్లలో వచ్చి నిర్ధేశించిన పార్కింగ్ స్థలాల్లో పార్కు చేసుకోవాలని సూచించారు.

గోల్కొండ కోటకు రాందేవ్‌గూడ నుంచి మక్కై దర్వాజ మీదుగా వచ్చేవారు అష్రూఖాన నుంచి మిలటరీ సెంట్రీ పాయింట్ వరకు, లంగర్‌హౌస్ నుంచి ఫతేదర్వాజ మీదుగా వచ్చేవారు హుడా పార్కు, సాలార్ ఫుట్‌బాల్ గ్రౌండ్, ఓవైసీ గ్రౌండ్‌లలో, సెవెన్ టూంబ్స్ నుంచి బంజార దర్వాజ మీదుగా వచ్చే వారు ప్రియదర్శిని స్కూల్, ఏరియా దవాఖాన, గోల్కొండ పోర్టు బస్టాప్ వద్ద సాలార్ ఫుట్‌బాల్‌గ్రౌండ్, ఓవైసీ గ్రౌండ్‌లలో తమ వాహనాలను పార్కు చేసుకోవాలని తెలిపారు.

Related posts