తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఎంపీ సుజనా చౌదరి తొలిసారి విజయవాడకు వచ్చారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి విజయవాడ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సుజనా చౌదరి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సుజనా రాక సందర్భంగా విజయవాడలో రహదారి పొడవున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ప్రధాని మోదీ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ర్యాలీ అనంతరం బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించే ఆత్మీయ సమావేశంలో సుజనా పాల్గొననున్నారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా సుజన ప్రసంగిస్తారని సమాచారం. అయితే ప్రసంగంలో ఆయన ఏం చెప్పబోతున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సుదర్శన యాగంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: హరీష్ రావు