వంట గ్యాస్ ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. ఎల్‌పిజి సిలిండర్ ధరలు పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. పెంచిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. మెట్రో నగరాల్లో ఒక్కో సబ్సిడీయేతర సిలిండర్ కు రూ. 4.50 వరకూ కోల్ కతా, హైదరాబాద్ నగరాల్లో రూ. 4.50, చెన్నైలో రూ. 4, ముంబైలో రూ. 3.50, ఢిల్లీలో రూపాయి చొప్పున ధరు పెరిగాయి.
పెరిగిన ధరల ప్రకారం, 14.2 కిలోల సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ రేటు హైదరాబాద్ లో రూ. 645.50, ఢిల్లీలో రూ. 594, కోల్ కతాలో రూ. 620.50, ముంబయిలో రూ. 594, చెన్నైలో రూ. 610కి చేరుకున్నాయి. కాగా, గత నెలలో కూడా వంటగ్యాస్ ధరలను మార్కెటింగ్ కంపెనీలు పెంచిన సంగతి తెలిసిందే.