telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మార్కెట్‌ కమిటీ ఛైర్మన్ లలో .. సగం మహిళలకే .. ఏపీసీఎం జగన్ ..

ఏపీ ప్రభుత్వం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్ పదవులలో సగం మహిళలకే ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. పంటలు వేసినప్పుడే వాటికి ధరలు ప్రకటించాలని కూడా స్పష్టం చేశారు జగన్‌. ఆరు నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలని ఆదేశించారు. మార్కెటింగ్‌, సహకార శాఖలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల మంత్రులు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మార్కెట్‌ కమిటీలలోని ఛైర్మన్ పదవుల్లో సగం మహిళలకు ఇవ్వడమే కాకుండా… కమిటీలో కూడా సగం వారికే చోటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జారీ అయిన జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లకు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలిచ్చారు. ఆరు నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలని, కనిస మద్దతు ధరలు లేని పంటలకూ ధరలు ప్రకటించాలని సూచించారు.

కనీస మద్దతు ధరలేని పంటలకూ ధరలు ప్రకటించాలన్నారు. అక్టోబరు చివరి నాటికి చిరుధాన్యాలపై బోర్డు ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యమంత్రి. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం ఇప్పుడున్న గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలపై సమగ్ర పరిశీలన చేయడంతో పాటు, అవసరమైన మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సహకార రంగంలో అవినీతి, పక్షపాతం ఉండకూడదని స్పష్టం చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు ఆనందంగా ఉండాలన్నదే తమ ఆశయమన్నారు. రైతు ఏ దశలో కూడా నష్టపోకూడదని సీఎం కోరినట్లు చెప్పారు.

Related posts