telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హెల్త్ బులెటిన్‌కు, వెబ్‌సైట్‌లో లెక్కలకు పొంతన లేదు: దేవినేని

devineni on power supply

కరోన కేసుల విషయంలో హెల్త్ బులెటిన్‌కు, వెబ్‌సైట్‌లో లెక్కలకు పొంతన ఉండటం లేదని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. జిల్లాల్లోని పరీక్షల వివరాలు మంత్రుల పేషీకి పంపమనడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. ఏపీలో కరోనా పరిస్థితులపై కేంద్రం, డబ్ల్యూహెచ్‌వో దృష్టి పెట్టాలని కోరారు. మెడికల్ కిట్ల కొనుగోళ్ల వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని ఉమ నిలదీశారు.

జగన్ చేయలేని పనులను టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తుండటాన్ని ఆయన ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. మీడియా ముందుకు వచ్చి సీఎం వాస్తవాలు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. లాక్‌డౌన్‌ను లాకప్‌తో పోల్చడం ఏ2 విజయసాయిరెడ్డికే చెల్లిందని దుయ్యబట్టారు. 210 మండలాల్లో కరోనా విజృంభిస్తున్నా.. 97 మండలాలే అంటూ ప్రభుత్వం ప్రకటించడంపై దేవినేనిఅసహనం వ్యక్తం చేశారు.

Related posts