ఆంగ్ల-కొత్త సంవత్సరంలో జరిగే తొలి పండుగ సంబరాలు
నూతన పంటలతో కలకలలాడిన గృహాలు
గుడిసె, ఇల్లు వాకిట్లో వెలసిన గొబ్బెమ్మలు
కోటి కాంతులతో మండే భోగి మంటలు,
బుస బుసమని పొంగే క్షీరధారలు
ఆకాశమంచులలో ఎగిరే గాలిపటలా విన్యాసాలు
ఆనందోత్సాహంలో జరిగే సంక్రాంతి సంబరాలు..
మంచు పూల రెమ్మలతో నింగివికసించింది
భోగభాగ్యాలతో భోగిని తెచ్చింది
రంగవల్లుల రంగులతో హరివిల్లు విరిసింది
అంబరాన్ని తాకే సంబరాల సంక్రాంతి
పల్లెలను సందడితో నింపిన సంక్రాంతి
అందరిలో ఆనందాన్ని తెచ్చిన సంక్రాంతి