telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరిన సోనూసూద్

Sonu-Sood

కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చాలామందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ మధ్యే దక్షిణ అమెరికాలో చిక్కుకపోయిన 100 మంది వైద్య విద్యార్థులను తిరిగి ఇండియాకు తీసుకువచ్చే మిషన్ ను చేపట్టారు. అయితే ఈ రోజు సోనూసూద్‌ సోషల్ మీడియా వేదికగా కొంతమందికి క్షమాపణలు చెప్పారు. ఆయన తాజాగా చేసిన ట్విట్ లో ”1137 మెయిల్స్‌, 19 వేల ఫేస్‌బుక్‌ మెసేజ్‌లు, 4812 ఇన్‌స్టా మెసేజ్‌లు, మరో 6741 ట్విటర్ మెసేజ్‌లు నాకు ఈ రోజు సహాయం కోరుతూ వచ్చాయి. నాకు సగటున రోజుకు ఇన్ని అభ్యర్థనలు సహాయం కోసం వస్తున్నాయి. ఇందులో ప్రతిఒక్కరినీ చేరుకోవడం అసాధ్యం. అయినా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను ఎవరి మెసేజ్‌ ను అయిన చూడలేకపోతే నన్ను క్షమించండి” అని తెలిపాడు. కాగా ముంబైతోపాటు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సురక్షితంగా ఇంటికి పంపించిన సోనూసూద్ పై‌ నెటిజన్లు, రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపించారు. వలసకార్మికులను తమ స్వగ్రామాలకు పంపించేందుకు సోనూ బస్సులు, రైళ్లతోపాటు విమాన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Related posts