telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కడుపు నొప్పి అని ఆసుపత్రికి వెళ్ళిన ఆమెకు షాక్…!!

baby

అమెరికాలోని లాస్ వెగాస్‌కు చెందిన మోనికా థాంప్సన్‌కు సడన్‌గా కడుపునొప్పి వచ్చింది. ఆఫీసులో పనికూడా సరిగా చేయలేకపోయింది. వెంటనే ఆస్పత్రికెళ్లిన ఆమె వైద్యులకు పరిస్థితి వివరించింది. ఆమె చెప్పిందంతా విన్న ఓ డాక్టరు బహుశా మీరు నెలతప్పారేమో అన్నాడు. అది విని నవ్వేసిన ఆమె.. ‘46 ఏళ్ల వయసులో మెనోపాజ్ దశలో ఉన్న నేను తల్లినవడం అసంభవం’ అని చెప్పింది. అయితే వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె 7నెలల గర్భవతని తేల్చారు. దీంతో షాకైన ఆమె ఎందుకైనా మంచిదని ఆరోజే ఆస్పత్రిలో జాయిన్ అయిపోయింది. అదృష్టం బాగుండి అదే ఆమెకు కలిసొచ్చింది. ఎందుకంటే ఆ తెల్లారే ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కేవలం 3పౌండ్ల బరువే ఉన్న ఆ పిల్లాడిని నెలరోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచారు. అనంతరం తల్లీబిడ్డలను డిశ్చార్జి చేశారు. ఇప్పడు ఆ పిల్లాడికి 11నెలలు. అతన్ని మోనికా ఎంతో అల్లారుముద్దుగా పెంచుతోంది. తల్లి కావాలనే తన కోరికను దేవుడు ఇలా తీర్చాడంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది.

Related posts