telugu navyamedia
business news news Technology trending

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ .. వచ్చేస్తుంది.. ధరలు అదిరిపోతున్నాయ్ ..

samsung galaxy fold in markets by 1st october

శాంసంగ్‌ మరో కొత్త మొబైల్ తో వచ్చేసింది. తమ వినియోగ దారుల అభిరుచులు తెలుసుకుంటూ, మార్పు చెందుతున్న కాలానికి టెక్నాలజీ కి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ లని సిద్దం చేయడంలో శాంసంగ్‌ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలోనే శాంసంగ్‌ అధునాతన టెక్నాలజీతో ఫోల్డ్ ( మడత ) ఫోన్ ని ప్రవేశపెట్టింది. శాంసంగ్‌ కి చెందిన మడత పెట్టగలిగే ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ ని అక్టోబర్ 1 నుంచీ భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఈ మొబైల్స్ అదే రోజు నుంచీ వినియోగ దారులకి అందుబాటులోకి రానున్నాయని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఈ ఫోన్ ధర తెలిస్తే మాత్రం కళ్ళు గిర్రున తిరగక మానదు.

ఈ మొబైల్ ధర సుమారు 1.50 లక్షల నుంచీ రూ 1.75 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ విక్రయం కేవలం ఫ్రీ-బుకింగ్ ద్వారా మాత్రమే బుక్ చేయడం జరుగుతుందని సంస్థ తెలిపింది. ఈ ఫోన్ 7.3ఇంచ్ ల ప్రైమరీ డిస్ప్లే , 4.6 ఇంచుల తో సెకండరీ డిస్ప్లే ఉంటుందని తెలిపింది. అంతేకాదు 12 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ కలిగి ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ యొక్క కెమెరా , మరిన్ని ఫీచర్స్ తెలుసుకోవాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

Related posts

ఫేస్‌బుక్‌ .. సొంత డిజిటల్‌ నగదు ‘లిబ్రా’..

vimala p

ప్రపంచ కప్ … టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో… జెర్సీ పై మార్పులు అందుకే..

vimala p

కారును మంచినీళ్ళతో శుభ్రం.. కోహ్లీసేనకు చలాన్ ..: లండన్ మున్సిపల్ ఇంజనీర్

vimala p