telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈనెల 14న సీఎం కేసీఆర్ బహిరంగ సభ !

తెలంగాణలో కూడా ఎన్నికల వేడి రాజకుంటుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలు తమ శస్త్రాలను బయటికి తీస్తున్నాయి. ఈ ఎన్నికలో నోముల భగత్‌ను రంగంలోకి దింపారు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.  మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను మండ‌లాల‌వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా నియ‌మించారు కూడా. నామినేష‌న్ల క్రతువు పూర్తికావ‌డంతో జిల్లా మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డితోపాటు ఇతర మంత్రులు త‌ల‌సాని, మ‌హ‌మూద్ అలీ, ఎర్రబెల్లి, స‌త్యవ‌తి రాథోడ్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారం మొద‌లుపెట్టారు. స‌భ‌లు, స‌మావేశాలు కాకుండా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి క్యాంపెయిన్ చేస్తున్నారు నాయకులు. ఉపఎన్నిక ‌నోటిఫికేష‌న్ రాకముందే సీఎం కేసీఆర్ నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించారు. ఎత్తిపోతల ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేసి హాలియా బ‌హిరంగస‌భ‌లో ప్రసంగిస్తూ.. జిల్లాకు, నాగార్జున‌సాగ‌ర్‌కు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పారు ముఖ్యమంత్రి. సాగ‌ర్ ప్రచారానికి ఇప్పుడు కొన్ని రోజులే గ‌డువుంది. సీఎం ప్రచారానికి వెళ‌తారో లేదో అన్నది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది.  సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్న తరుణంలో… స్వయంగా సీఎం కేసీఆర్‌ కూడా రంగంలోకి దిగుతున్నారు. 14న అనుములలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కేసీఆర్‌ సభ కోసం టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆ సభలో సీఎం కేసీఆర్‌ ప్రస్తావించనున్నారు.

Related posts