telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

జేసీకీ ఆర్టీఏ అధికారుల షాక్.. 23 ట్రావెల్స్‌ బస్సులు సీజ్‌

Diwakar-Travels-Buses

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి రవాణా శాఖ అధికారులు షాక్‌ ఇచ్చారు. దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడస్తున్న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులపై రవాణా శాఖ కమిషనర్‌ సీతారామాంజనేయులు, జాయింట్‌ కమిషనర్‌ ప్రసాద్‌ రావు ఆధ్వర్యంలోని అధికారులు పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారంగా టికెట్‌ ధరలు వసూలు చేస్తున్న 23 బస్సులను అధికారులు గుర్తించి సీజ్‌ చేశారు.

అంతేకాకుండా దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్‌ స్టేట్‌ క్యారియల్‌ బస్సుల పర్మిట్లను కూడా రద్దు చేశారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమించినందుకు పలు కేసులు నమోదు చేశారు. అయితే దివాకర్‌ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేశామని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.

Related posts