telugu navyamedia
andhra crime news political

జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. ఘాటుగా స్పందించిన పవన్

pawan-kalyan

తాడేపల్లిగూడెంకు చెందిన ఉన్నమట్ల లోకేశ్ అనే జనసేన పార్టీ కార్యకర్త  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక లోకేశ్ ఆత్మహత్యకు పాల్పడడం ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు. ఉన్నమట్ల లోకేశ్ ను సీఐ రఘు వేధించినట్టు తమకు తెలిసిందని పవన్ పేర్కొన్నారు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోందని విమర్శించారు. ఓ జనసైనికుడ్ని వేధింపులతో ఆత్మహత్యకు ప్రేరేపించిన సీఐ రఘుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాలను ప్రశ్నించిన వారిని వేధించడం చట్ట సమ్మతమా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. తాము ప్రజలకే జవాబుదారీ తప్ప అధికార పక్షానికి కాదని పోలీసు అధికారులు గుర్తించాలని పవన్ హితవు పలికారు.

Related posts

ఏపీలో శాసనమండలి ఎన్నిక.. పోలింగ్ నేడే..

vimala p

2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించండి!

vimala p

సైనికుల త్యాగాలాను .. రాజకీయాలు చేయకండి.. : ఈసీ

vimala p