telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

రైల్ టికెట్లపై సర్వీస్‌ చార్జీల బాదుడు.. ఐఆర్సీటీసీ లో మరీ ఘోరంగా..

jobs in IRCTC through walk-in

రైల్ టికెట్లపై సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో నేటి నుండి ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా రైల్ టికెట్ బుక్ చేస్తే, మరింత బాదుడు తప్పదు. ఈ–టికెట్లపై నేటి నుంచి సర్వీస్‌ చార్జీలను వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. నాన్‌ ఏసీ టికెట్లపై రూ.15, అన్ని ఏసీ తరగతులపై రూ. 30 అదనంగా వసూలు చేయనున్నామని, ఈ సర్వీస్‌ చార్జీకి జీఎస్టీ అదనమని ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రజలను డిజిటల్‌ చెల్లింపులవైపు మళ్లించి, టికెట్ల అమ్మకాలను పెంచేందుకు మూడు సంవత్సరాల క్రితం ఈ సర్వీస్ చార్జీని ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో నాన్‌ ఏసీకైతే రూ.20, ఏసీకైతే రూ.40 చొప్పున సర్వీస్‌ చార్జ్ ఉండేదన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సర్వీస్ ఛార్జి ప్రైవేటీకరణలో భాగంగా అలవాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.

Related posts