telugu navyamedia
telugu cinema news

రణబీర్-అలియా భట్ ల పెళ్లి.. ఈ ఏడాదే.. !!

Alia-Bhatt
బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్‌, యంగ్ భామ అలియా భట్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తుందని , త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోనున్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. అయితే రీసెంట్‌గా జోయా అక్తర్ తెరకెక్కించిన గల్లీ బాయ్ స్పెషల్ స్క్రీనింగ్‌కి హాజరైన వీరిద్దరు ఎడమొహం పెడమొహం పెట్టుకున్నారని, కారు దిగేముందు ఇద్దరి మధ్య భారీ వాగ్వాదం చోటు చేసుకుందని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. వీటిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు బ్రహ్మాస్త్రా జంట. 
ప్రేమికుల రోజు సందర్భంగా అలియా భట్‌.. రణ్‌బీర్ కపూర్ ఇంటికి వెళ్లి ఆయన పర్సనల్ చెఫ్ హరీష్ దీక్షిత్ తయారు చేసిన వ్యాలంటైన్ డిన్నర్ ఆరగించింది. అంతేకాదు వీరు ముగ్గురు కలిసి ఫోటోకి ఫోజులివ్వగా ఆ ఫోటోని హరీష్ దీక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో రణ్‌బీర్ కపూర్‌, అలియాలు చాలా సంతోషంగా కనిపిస్తుండడంతో ఇద్దరికి చెడిందనే వార్త రూమర్‌గానే మిగిలిపోయింది. బాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ ఏడాదే రణ్‌బీర్ కపూర్‌, అలియా భట్‌లు పెళ్లి పీటలెక్కనున్నట్టు తెలుస్తుంది.

Related posts

ప్రియుడితో నయన్ ప్రత్యేక పూజలు

vimala p

బిగ్ బాస్-3 : వైల్డ్ కార్డు ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి

vimala p

“ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్” తెలుగు ట్రైలర్

vimala p