telugu navyamedia
సినిమా వార్తలు

తుదిశ్వాస విడిచిన “URI” నటుడు

Navtej Hundal

బాలీవుడ్ నటుడు నవతేజ్ హుందాల్ సోమవారం సాయంత్రం ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ముంబైలో ఆయన నివాసంలో కన్నుమూశారు. నవతేజ్ కి భార్య అవంతిక, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. 1993లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం “ఖల్‌నాయక్”, 1996లో వచ్చిన “‘తేరే మేరే సప్నే”, 2009 లో “ది విస్పరర్స్” వంటి చిత్రాల్లో నవ్‌తేజ్ నటించారు. ఆయన ఆఖరిగా నటించిన బాలీవుడ్ చిత్రం “URI”. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నవతేజ్ హోం మంత్రి పాత్రలో కనిపించారు. ఆయన మృతి పట్ల సినీ, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. నవతేజ్ కుటుంబ సభ్యులకు బాలీవుడ్ ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు.

Related posts