telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“చిత్రపురి కాలనీ” సేవలో వినోద్ బాలా

Vinod-Bala

ప్రముఖ బుల్లితెర, చలనచిత్ర నటుడు, రంగస్థల అధ్యాపకుడు, నిర్మాత వినోద్ బాల పుట్టినరోజు నేడు. ఏరోనాటిక్స్ కోర్సుని మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ లోని మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకొని, బంగారు పతకం సాధించారు. పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమాలో భానుప్రియ సోదరుడి పాత్రలో నటించి తెరంగేట్రం చేసిన వినోద్ బాల, టి.వి.ఆర్టిస్టుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా చేసారు. మంజులానాయుడు దర్శకత్వంలో యద్ధనపూడి సులోచనారాణి నవల “ఆగమనం”ను ‘రుతురాగాలు’ పేరిట టీవీ సీరియల్‌గా తీసినప్పుడు, అందులో వినోద్‌బాల కూడా ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఆ సీరియల్ హిట్ కావడం వల్ల మరిన్ని అవకాశాలు పొందిన నటుల్లో వినోద్‌బాల కూడా ఒకరు. ‘కసూర్తి’ టీవీ సీరియల్‌లో నటనకు గాను ఉత్తమ సహాయనటుడిగా పురస్కారాన్ని కూడా పొందారు వినోద్ బాల. ఈయన ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్‌తో కలిసి కామెడీ ఫిలిం అవార్డ్స్ అనే కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేశారు. రామ్‌గోపాల్‌వర్మ “శివ” సినిమాకి దర్శకత్వం వహిస్తున్నప్పుడు తొలుత వినోద్‌బాల పైనే హీరో ట్రైల్ షూట్ తీశారని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఇప్పుడు “చిత్రపురి కాలనీ” ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. పేద సినీ కార్మికులకు ఇళ్లను కేటాయిస్తూ వారిని ఆదుకుంటున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వినోద్ బాలాకు నవ్యమీడియా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Related posts